: జయకు యాంజియోగ్రామ్ పూర్తి... 24 గంటలు గడవాలన్న వైద్యులు


నిన్న రాత్రి గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ ఉదయం ప్రత్యేక వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆమె గుండె కవాటాల్లో ఉన్న సమస్యను తొలగించినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గుండెకు ఊతమందించే 'ఎక్మో' యంత్రం సాయంతో ఆమెకు చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటల పాటు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచాల్సి వుందని, ఆ తరువాతనే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రాగలమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. కాగా, జయకు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్న లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే, అపోలో వైద్యులతో ఏకీభవించారని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో ఆమెకు అత్యంత ఆధునిక, మెరుగైన వైద్య చికిత్సే అందుతోందని రిచర్డ్ అభిప్రాయపడ్డట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మొత్తం 8 మంది కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు ఆమెను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపాయి.

  • Loading...

More Telugu News