: తమిళనాడులో విద్యాసంస్థలు బంద్.. అపోలో ఆస్పత్రి వద్ద పారామిలటరీ బలగాల మోహరింపు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఒక్కసారిగా క్షీణించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఆమెకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, పెట్రోలు బంకులకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించారు. కేంద్రం నుంచి కూడా ప్రత్యేక బలగాలు రాష్ట్రానికి బయలుదేరాయి.

  • Loading...

More Telugu News