: ఈ బంగారానికి బిల్లులు కావాలంటే నేను స్వర్గానికి వెళ్లి రావాలి: యూపీ ‘గోల్డ్ మ్యాన్’
ఒంటి నిండా నగలు, చేతి వేళ్లకు ఉంగరాలు, మందపాటి బ్రేస్ లెట్.. ఇలా సుమారు నాలుగు కిలోల బంగారాన్ని ధరించి అట్టహాసంగా తిరిగే ఉత్తరప్రదేశ్ ‘గోల్డ్ మ్యాన్’ మనోజ్ సెంగార్ గుర్తుండే ఉంటాడు. మన వద్ద ఉన్న బంగారానికి సరైన బిల్లులు చూపించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నిర్ణయంపై ‘గోల్డ్ మ్యాన్’ మండిపడుతున్నాడు. తన ముత్తాతలు, తాతలు, తండ్రి ఇచ్చిన బంగారం తన వద్ద ఉందని, దానిని తాను భద్రపరచుకున్నానని చెప్పాడు. ఇప్పుడు, ఈ బంగారానికి సంబంధించిన బిల్లులు కావాలని ప్రభుత్వం అడిగితే.. తాను స్వర్గానికి వెళ్లి తన తాతలు, ముత్తాతలను అడగాల్సి ఉంటుందన్నాడు. ప్రభుత్వం అంటే తనకు గౌరవమే కానీ, ఈ నిర్ణయం సబబు కాదంటూ కాన్పూర్ కు చెందిన ఈ గోల్డ్ మ్యాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.