: మహిళల టీ 20 ఆసియా కప్ .. పాక్ పై భారత్ గెలుపు


మహిళల ఆసియా కప్ టీ 20 టోర్నీని భారత జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఈ విజయాన్ని సాధించింది. భారత జట్టు విజయం సాధించడానికి మిథాలీరాజ్ (73) కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ లను భారతజట్టు గెలుచుకోవడం విశేషం. ఇరు జట్ల స్కోర్లు.. భారత్ 121/5, పాకిస్థాన్ 104/6. బ్యాంకాక్ లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.

  • Loading...

More Telugu News