: రూ. 10 చిల్లర కోసం గొడవపడి క్యాబ్ డ్రైవర్ ను చంపేసిన ప్రయాణికులు


చిల్లర లభించక ప్రజలు అసహనానికి లోనవుతూ హత్యలు చేసేందుకు సైతం వెనుకాడని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్న ఘటన ఇది. యూపీలోని బందా నగరంలో రూ. 10 చిల్లర కోసం క్యాబ్ డ్రైవర్ ను ముగ్గురు ప్రయాణికులు దారుణంగా కొట్టి హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ ఓ గ్రామం నుంచి బందాకు వచ్చారు. ఆపై వీరి మధ్య గొడవ వచ్చింది. ముగ్గురూ కలసి డ్రైవర్ మున్నాపై దాడికి దిగారు. ఈ ఘటనలో మున్నా అక్కడికక్కడే మరణించగా, ఘటనా స్థలి నుంచి ముగ్గురూ పారిపోయారు. ఆపై విచారణ ప్రారంభించిన పోలీసులు పారిపోయిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News