: హైదరాబాదులో బంగారం షాపులపై ఐటీ దాడులు


పెద్దనోట్ల రద్దుతో చోటుచేసుకున్న పరిణామలపై కేంద్రం కన్నేసింది. దీంతో అకౌంట్లలో పెద్ద ఎత్తున జమ అవుతున్న డబ్బులు, అలాగే పెద్దఎత్తున జరుగుతున్న వస్తు కొనుగోళ్లపై కూడా ఐటీ శాఖ కన్నేసింది. దీంతో హైదరాబాదులోని బంగారం షాపులపై ఐటీ శాఖ దాడులు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన రోజు హైదరాబాదులోని బంగారం షాపుల్లో భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. సుమారు వంద కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం పది బంగారం దుకాణాలపై దాడులు చేశారు. ఈ దుకాణాల్లో ఆరోజు జరిగిన కొనుగోళ్ల సీసీ టీవీ పుటేజ్ డిలీట్ చేసినట్టు గుర్తించారు. దీంతో పలు షాపులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News