: నియంతలే మట్టికరిచారు...కేసీఆర్ ఎంత?: శ్రవణ్


మహామహా నియంతలే మట్టికరిచిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని విమర్శించారు. దీనికి నిదర్శనం విమలక్క (తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్) కార్యాలయాన్ని సీజ్ చేయడమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తాళం వేసింది కేవలం విమలక్క ఇంటికి మాత్రమే కాదని, ప్రశ్నించే గొంతులకని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం ఉందనే కేటీఆర్ టీజేఏసీ నేత కోదండరామ్ పై నోరు పారేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కోదండరామ్ అంటే ఒక్క మనిషి కాదని, ఆయన వెనుక తెలంగాణ సమాజం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News