: సిబ్బందిని లోపలే ఉంచి బ్యాంకుకు తాళం వేసిన గ్రామస్తులు


పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి 25 రోజుల‌యినప్పటికీ నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి డ‌బ్బు అంద‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. తాజాగా హర్యానాలోని జింద్‌ జిల్లా దరువానీ గ్రామంలోని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ వద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. చిల్ల‌ర‌లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అక్క‌డి ప్ర‌జ‌లు గంట‌ల కొద్దీ బ్యాంకు ముందు నిల‌బ‌డ్డారు. అనంత‌రం వారికి బ్యాంకు సిబ్బంది రూ.2000 నోట్లు మాత్ర‌మే ఇచ్చారు. ఆ నోట్లు ఏం చేసుకోవాలంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని బ్యాంకులోనే ఉంచి తాళం వేసి, వారికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దాంతో దాదాపు 4 గంటల పాటు సిబ్బంది బ్యాంకులోనే ఉండిపోయారు. అనంత‌రం వారికి విముక్తి క‌ల్పించారు. నిన్న జరిగిన ఈ ఘటనతో ఈ రోజు బ్యాంకు సిబ్బంది బ్యాంకును ఓపెన్ చేయ‌లేదు. దీంతో ఈ ఉదయం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News