: మనం ఒకరిని గౌరవిస్తేనే మనకు వాళ్లు గౌరవమిస్తారు!: సహచర ఆటగాడికి క్లాసు పీకిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ చేసిన విమర్శలపై ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు విరుచుకుపడుతున్నారు. నిన్న కోచ్ డారెన్ లీమన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, నేడు స్మిత్ క్లాసు పీకాడు. సహచరులు, ప్రత్యర్థులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికాడు. మ్యాక్స్ అలా మాట్లాడి వుండాల్సింది కాదని పేర్కొన్నాడు. మనం గౌరవమిస్తేనే మనకు గౌరవం లభిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించాడు. మాథ్యూవేడ్ పై చేసిన వ్యాఖ్యలు జట్టు మొత్తాన్ని బాధించాయని తెలిపాడు. కేవలం ఆటగాళ్లకే కాదు, అభిమానులు, మీడియా ఇలా ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తే మన గౌరవం నిలబడుతుందని స్మిత్ సూచించాడు. కాగా, సౌతాఫ్రికాతో పింక్ బాల్ తో జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో తనకు బదులుగా మాథ్యూవేడ్ ను ఎంపిక చేయడంతో మ్యాక్స్ వెల్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.