: నేను మాటలు చెప్పాలనుకోవడం లేదు...నా పంచ్ లే సమాధానం చెబుతాయి: విజేందర్ సింగ్


ప్రొఫెషనల్ బాక్సింగ్ లో ఓటమి ఎరుగని వీరుడు తొలిసారి నోరువిప్పాడు. బౌట్ కు ముందు ప్రత్యర్థులు విసిరే సవాళ్లకు రింగ్ లో పంచ్ లతో సమాధానం చెప్పిన విజేందర్ సింగ్ తొలిసారి బయట సమాధానం చెప్పాడు. ఫ్రాన్సిస్ ఛెకా ఎలాంటి ప్రత్యర్థో తనకు ముందే తెలుసని అన్నాడు. ఛెకా అత్యంత అనుభవజ్ఞుడని, అందుకే ఇంతవరకు పడ్డ కష్టానికి రెట్టింపు కష్టపడుతున్నానని తెలిపాడు. ఛెకాను ఓడించేందుకు తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందని చెప్పాడు. ఛెకా విసిరే పంచ్‌ లను అడ్డుకొని ఎలా పిడిగుద్దులు కురిపించాలో తనకు తెలుసన్నాడు. గత రెండు నెలలుగా పంచ్‌ లు విసరడంపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నానని చెప్పాడు.. ప్రత్యర్థిపై తన పాచిక పారుతుందన్న ధీమా ఉందని పేర్కొన్నాడు. ఛెకా తనను తక్కువ అంచనా వేస్తున్నాడని, తాను కేవలం ఏడు బౌట్ లలో తలపడితే అందులో ఆరు నాకౌట్ లేనని గుర్తు చేశాడు. తన గురించి ఛెకాకు ఎవరైనా సరైన సమాచారం అందించాలని సూచించాడు. తాను గొప్ప విజయం సాధించాలనుకుంటున్నానని తెలిపాడు. ఆ గొప్పవిజయం నాకౌట్ కావాలని వెల్లడించాడు. అదే సమయంలో తన ఎదుట ఉన్న సవాల్‌ గురించి అవగాహన ఉందని విజేందర్ తెలిపాడు. తనతో తలపడిన ప్రతి ప్రత్యర్థి బౌట్ కు ముందు ఇలాగే మాట్లాడారని, అయితే రింగ్ లో పంచ్ లతో సమాధానం చెప్పానని విజేందర్ సింగ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News