: హక్కానీ నెట్ వర్క్ పై పోరుకు పాకిస్థాన్ కు అమెరికా భారీ సాయం


పాకిస్థాన్ కు రూ. 6,121 కోట్ల సహాయం అందించే రక్షణ బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఈ సహాయం ఆర్థికంగానే కాకుండా ఇతర రూపాల్లో కూడా ఉంటుంది. హక్కానీ నెట్ వర్క్ ను అంతం చేయడానికి పాకిస్థాన్ గట్టి చర్యలు తీసుకుంటోందనే ఉద్దేశంతోనే అమెరికా ఈ సహాయం చేస్తోంది. అన్ని దేశాలకు కలిపి రూ. 7,481 కోట్ల సహాయం చేస్తుండగా... అందులో రూ. 6,121 కోట్లు పాకిస్థాన్ కే ఇస్తోంది. వాస్తవానికి హక్కానీ నెట్ వర్క్ ను అంతం చేసే దిశగా పాకిస్థాన్ చేస్తున్నదేమీ లేదు. ఇదే కారణంతో, ఇంతకు ముందు విడుదల చేయాల్సిన రూ. 2000 కోట్ల సాయాన్ని అమెరికా ఆపేసింది. కానీ, ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వచ్చేవారం సెనేట్ ఆమోదం కోసం ఈ బిల్లు వెళుతోంది. అయితే, ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం కావడంతో, బిల్లుకు వ్యతిరేకత ఉండకపోవచ్చని సమాచారం. మరోవైపు నెల రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో పాక్ కు ఇంత భారీ సహాయం చేయాలనుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News