: హిందూ సంప్రదాయం ప్రకారం హజల్‌ కీచ్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్న యువరాజ్‌ సింగ్


మూడు రోజుల క్రితం సిక్కుల సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆట‌గాడు యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, పెళ్లి కూతురిది హిందూ సంప్ర‌దాయం కాబ‌ట్టి వాళ్లు నిన్న ఆ సంప్ర‌దాయంలో మ‌రోసారి పెళ్లిచేసుకున్నారు. ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఈ తంతు నిర్వ‌హించారు. ఈ వేడుకలో వ‌ధూవ‌రుల‌ కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఇరు కుటుంబ సభ్యుల అభీష్టం మేర‌కు మేరకు యువరాజ్‌, హజల్‌ల వివాహాన్ని సిక్కు సంప్ర‌దాయంతో పాటు హిందూ సంప్రదాయాల ప్రకారం కూడా జరిగింది. కాగా, ఈ నెల 7న ఢిల్లీలో వీరి పెళ్లి విందును ఘ‌నంగా నిర్వ‌హించనున్నారు. ఈ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ న‌టులు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్‌తో పాటు ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News