: ‘బాలీవుడ్’తో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం క్రికెటర్లకు లేదు: సెహ్వాగ్


‘వీరు కే ఫన్డే’ అనే వెబ్ సిరీస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ‘బాలీవుడ్’పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘బాలీవుడ్’తో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం క్రికెటర్లకు ఎంతమాత్రం లేదని, ఆ రెండింటికి ఎటువంటి దగ్గర సంబంధం లేదని అన్నాడు. ఆ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడే పరిస్థితి కూడా లేదని, మరి, అటువంటప్పుడు ఆ రెండింటిని ఒక్కటిగా ఎలా చూస్తామని ప్రశ్నించాడు. అయితే, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ యజమానిగా ఉండటంపై అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ సమాధానమిస్తూ.. కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి కనుకే జట్టును కొనుగోలు చేశారని అన్నారు. అంతే తప్ప, బాలీవుడ్ కు -క్రికెట్ కు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని గ్రహించాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News