: పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి 93 శాతం మంది ప్రజల మద్దతు.. ప్రధాని యాప్ సర్వే ఫలితాలు!
పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజలు వారి స్పందనను తెలపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన యాప్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. ఆ యాప్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. 10.20 లక్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని చెప్పారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 684 జిల్లాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. మోదీ నిర్ణయానికి 90 శాతానికి పైగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు, కేవలం రెండు శాతం మంది ప్రజలు వెరీ పూర్ అనే రేటింగ్ ఇచ్చారు. తమ నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రజలకి మోదీ ధన్యావాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.