: రూ.5 కోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. రూ.90 లక్షలే రద్దైన నోట్లు, మిగతావన్నీ కొత్త నోట్లే!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరులు తమ నగదును మార్చుకోవడానికి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం అందుకుంటున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు పోలీసుల సాయంతో దేశ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా బెంగళూరులో సోదాలు నిర్వహించిన వారికి ఆ నగరంలోని పలు ప్రాంతాల్లో 5.7 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. అందులో 90 లక్షల విలువైన రద్దైన నోట్లు ఉండగా, మిగతావన్నీ కొత్త రెండు వేల రూపాయల నోట్లే కావడం గమనార్హం. అంతేగాక, 9 కిలోల బంగారం, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడినప్పటికీ కొత్త నోట్లు దొరక్క ప్రజలు నానా కష్టాలు పడుతోంటే, నల్లకుబేరుల వద్ద మాత్రం భారీ ఎత్తున రూ.2000 నోట్లు బయటపడుతున్నాయి.