: 21 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చిన భారత మహిళల క్రికెట్ జట్టు


ఆసియా కప్‌ మహిళల టీ20 టోర్నీలో భారత మహిళా జట్టు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా ఐదు మ్యాచ్ లు ఆడిన భారత మహిళా జట్టు ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నేపాల్‌ తో తలపడిన భారత మహిళా జట్టు 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ ఉమన్ శిఖా పాండే (39) రాణించడంతో మహిళా జట్టు 121 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్‌ జట్టు చతికిలపడింది. ఒక్కరంటే ఒక్కరూ కూడా భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. దీంతో సైకిల్ స్టాండ్ ను తలపించిన నేపాల్ బ్యాట్స్ ఉమన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌ కు క్యూ కట్టారు. దీంతో నేపాల్ జట్టు కేవలం 16.3 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. నలుగురు క్రీడాకారిణులు డక్కౌట్ కాగా, సరిత మగర్‌ (6) అత్యధిక స్కోరు సాధించడం విశేషం. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ మూడు వికెట్లతో రాణించగా, మేఘన, పాటిల్‌ చెరో రెండు వికెట్లు, పాండే, జోషి, బిస్తా తలో వికెట్‌ తో ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News