: అనంతపురం, విశాఖ, కడప, తిరుపతిలకు విమానాల్లో నగదు తరలింపు
ఇరు తెలుగు రాష్ట్రాలకు యుద్ధ ప్రాతిపదికన ఆర్బీఐ నగదును తరలిస్తోంది. ఈ ఉదయం ఏపీకి రూ. 2500 కోట్ల కొత్త నగదు చేరింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది. అనంతపురం, విశాఖపట్నం, కడప, తిరుపతిలకు డబ్బును విమానాల్లో తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు రోడ్డు మార్గాల్లో తరలించనున్నారు. ఈ డబ్బుతో ప్రజల కరెన్సీ కష్టాలు పూర్తిగా తొలగకపోయినా... కొంతమేర ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మధ్యాహ్నంకల్లా ఈ నోట్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొత్త నెల ప్రారంభం కావడంతో ప్రజలంతా చేతుల్లో డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.