: బార్ కోడ్ సమాచారాన్ని మీరూ తెలుసుకోవచ్చు.. సిద్ధమవుతున్న మొబైల్ యాప్
మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులపై ఉండే బార్ కోడ్‌లోని సమస్త సమాచారాన్ని ఇకనుంచి మీరు కూడా చదివేయవచ్చు. ఇందుకు సంబంధించిన ఓ మొబైల్ యాప్ సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోకానీ, లేదంటే వచ్చే నెలలో కానీ ఈ యాప్‌ను ప్రారంభించేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం సమాయత్తమవుతోంది. అందుబాటులోకి రానున్న యాప్ ద్వారా బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే అందులోని సమస్త సమాచారం డీకోడ్ అవుతుంది. అంటే బ్రాండ్ నేమ్, బరువు, తయారీ తేదీ, ఎక్స్‌పయిరీ డేట్, హెల్ప్‌లైన్ నంబర్లు అన్నీ ప్రత్యక్షమవుతాయి. అలాగే ప్యాకేజింగ్ నిబంధనలు కూడా మార్చేందుకు కన్జుమర్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ సిద్ధమవుతోంది. చిన్న ప్యాకెట్లపై ఉండే అక్షరాల సైజును 50శాతం పెంచాలని యోచిస్తోంది. మొబైల్ యాప్‌ను వినియోగదారుల హక్కుల దినోత్సవమైన ఈనెల 24వ తేదీన ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అధికారులను ఆదేశించారు.