: రూ. 1.87 కోట్లతో సినీ నటుడు నాగార్జున కొత్త కారు... నంబర్ 9669


హీరో నాగార్జున సరికొత్త బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ లోని ఆర్టీయే ఆఫీసుకు వచ్చిన ఆయన, ఫోటో దిగి డిజిటల్ సంతకం చేశారు. ఆపై టీఎస్ 09 ఈక్యూ 9669 నంబరును ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తి చేయించారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ లో వచ్చిన ఈ కారు 445 హెచ్పీ సామర్థ్యమున్న కారు. 4.4 లీటర్ టర్బో చార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ సాయంతో నాలుగు సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అల్యూమినియం బాడీ, కార్బన్ ఫైబర్ రీ ఇన్ ఫార్స్ ప్లాస్టిక్, విలాసవంతమైన ఇంటీరియర్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, టచ్ కమాండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలు.

  • Loading...

More Telugu News