: హైదరాబాద్‌లో నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టు.. కోటి కొత్తనోట్లు స్వాధీనం
కమీషన్‌కు కొత్తనోట్లను మార్పిడి చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. గురువారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.95 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో రామాంతపూర్‌కు చెందిన పద్మజ నుంచి రూ.27.48 లక్షలు, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన రాంబాబు నుంచి రూ.28 లక్షలు, సురేందర్ అనే వ్యక్తి నుంచి రూ.10 లక్షలు, మహేశ్ నుంచి రూ.10 లక్షలు, వరంగల్ జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ నుంచి రూ.19.70 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 శాతం కమీషన్‌తో నోట్లు మార్చేందుకు వీరు హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరికి ఇంత పెద్దమొత్తంలో కొత్త కరెన్సీ ఎలా అందిందనే దానిపై విచారణ చేపట్టారు.