: 4 కోట్ల రూపాయల 2,000 నోట్లు చూసి షాకైన పోలీసులు
దేశ వ్యాప్తంగా ఏటీఎంలు మూతబడిపోయాయి. కొన్ని ఏటీఎంలు పని చేస్తున్నప్పటికీ ఏ టైంలో తెరుచుకుంటాయో, ఏ టైంలో మూసుకుని ఉంటాయో చెప్పలేని పరిస్థితి. బ్యాంకుల ముందు తెల్లవారు జాము నుంచే లైన్లు కట్టేసి ఉంటున్నారు. బ్యాంకులు తెరిచిన కాసేపటికే నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ జరిపిన తనిఖీల్లో 4 కోట్ల రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లు పట్టుబడ్డాయి. వీటిని చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఈ మొత్తం ఒక ఇంజనీర్, కాంట్రాక్టర్ వద్ద లభ్యం కావడం, వారి వద్దనుంచి పెద్ద ఎత్తున ఐడీ కార్డులు లభ్యం కావడంపై ఆరాతీస్తున్నారు. వారికి బ్యాంకు అధికారులు, ఏటీఎంలలో డబ్బు నింపే సిబ్బంది సాయం చేసినట్టు ఐటీ శాఖాధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.