: స్మార్ట్ ఫోన్ తో గౌతమీ పుత్ర శాతకర్ణి... యాపిల్ నోట్ బుక్ తో గౌతమీ బాలశ్రీ


2వ శతాబ్దానికి చెందిన చక్రవర్తి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాడని ఊహించకండి... 'గౌతమీ పుత్ర శాతకర్ణి' పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సహనటులతో మాట్లాడుతుండగా, యాపిల్ నోట్ బుక్ ను 'గౌతమీ బాలశ్రీ' (శాతకర్ణి తల్లి) చూసుకుంటున్న ఫోటోను ప్రముఖ నటి హేమమాలిని తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ పూర్తయిందని, ఇందులో తనతోపాటు శ్రియ శరణ్ కూడా నటిస్తోందంటూ ఆమె తెలిపారు. కాగా, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హేమమాలిని తమిళనాడులో జన్మించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News