: ఐదు పౌండ్ల నోట్లను విరాళంగా తీసుకోమంటున్న హిందూ దేవాలయ అధికారులు
ఇకపై ఐదు పౌండ్ల నోట్లను విరాళంగా తీసుకోబోమని ఇంగ్లాండ్ లోని లీసెస్టర్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ సంతన్ మందిర్ ప్రకటించింది. ఈ నోట్ల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించడమే కారణమని ఆలయ అధికారులు అంటున్నారు. జంతు హింసకు తాము వ్యతిరేకమని, ఈ నోట్లపై నిషేధం విధిస్తున్నామని ఆలయ అధ్యక్షుడు విభూతి ఆచార్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించిన మాట వాస్తవమేనని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటించిన మర్నాడే ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఐదు పౌండ్ల నోట్ల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై ఇక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఇంగ్లండ్ లోని యాభై వేల మంది హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఒక పిటిషన్ రూపొందించి, దానిపై వారు సంతకం చేశారు.