: బ్యాంకు క్యూ లైన్లలో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: వైఎస్సార్సీపీ డిమాండ్


బ్యాంకు క్యూ లైన్లలో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నవారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News