: సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగులు


ఏపీ సచివాలయం ఉద్యోగులు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదును బ్యాంకు నుంచి అందుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ నుంచి ఈ మొత్తాన్ని వారు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సచివాలయ ఉద్యోగులు తమ కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు, చిల్లర సమస్యతో ప్రజలు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు తమ జీతాల్లో రూ.10 వేల చొప్పున నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

  • Loading...

More Telugu News