: అమరావతిలో రూ. 4 వేల కోట్లతో స్టార్ హోటల్, మెడికల్ కాలేజీ


ఈ రోజు అమరావతిలో ఏపీ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. రూ. 4 వేల కోట్లతో స్టార్ హోటల్, మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. బీఆర్ శెట్టి మెడికల్ వర్శిటీకి 100 ఎకరాలు కేటాయించాలని... అలాగే, అమరావతి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ కు 1.5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల డిజైన్లపై రెండు రోజుల్లో బిడ్ ల పరిశీలన జరపాలని నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News