: ఏటీఎంలో రెండు కార్డులు వాడాడని చెయ్యి విరగ్గొట్టిన కానిస్టేబుల్!


నోట్ల కోసం ఏటీఎంలకు వెళుతున్న వారు చాంతాడంత క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. గంటలసేపు క్యూ లైన్లో నిలబడ్డా డబ్బులు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే, ఏటీఎంలో ఒక్కొక్కరు మూడు, నాలుగు కార్డులను వినియోగిస్తూ, వచ్చినకాడికి లాగేస్తున్నారు. దీంతో, వెనకున్న వారిలో అసహనం పెరిగిపోతోంది. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా చాగలమర్రిలో నిన్న జరిగింది. ఏటీఎం వద్ద క్యూలైన్లో ఉన్న సుధాకర్ అనే వ్యక్తి తన వంతు రాగానే ఏటీఎంలోకి వెళ్లి, రెండు కార్డులతో డబ్బును డ్రా చేశాడు. దీంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజా హుసేన్ అతడిని అడ్డుకున్నాడు. నువ్వొక్కడివే రెండు కార్డులు వినియోగిస్తే... వెనకున్న వారికి డబ్బులు వద్దా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేని కానిస్టేబుల్ హుసేన్... సుధాకర్ చెయ్యి పట్టుకుని తిప్పాడు. దీంతో, అతని చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం జిల్లా ఎస్పీకి చేరడంతో... హుసేన్ ను వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News