: వయాగ్రా యాడ్ లో మోదీ ప్రస్తావన... ఎంత తీసుకున్నారని ప్రశ్నించిన కేజ్రీవాల్


'స్టే-ఆన్' పవర్ క్యాప్స్యూల్స్ దినపత్రికల్లో ఇచ్చిన వ్యాపార ప్రకటన, ప్రధాని నరేంద్ర మోదీపై కొత్త విమర్శలు తెచ్చిపెట్టింది. నోట్ల రద్దు తరువాత, చెల్లింపుల మాధ్యమ సంస్థ పేటీఎం ఆదాయం గణనీయంగా పెరిగిన ఆనందంలో, ప్రధాని మోదీ ఫొటోతో ఫుల్‌ పేజీ వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపై దేశీయ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించగా, కేజ్రీవాల్ దానిపై విమర్శలు గుప్పించారు. పాత నోట్ల రద్దును సమర్థిస్తూ, మోదీ నిర్ణయానికి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే తమ మాత్రలకూ పోలికలు ఉన్నాయని 'స్టే-ఆన్' ఈ ప్రకటనలో వెల్లడించింది. ‘థింక్‌ డిమానిటైజేషన్‌, థింక్‌ స్టే-ఆన్‌’ అంటూ మొదలయ్యే ప్రకటనలో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నాయకుడికి అభినందనలు తెలపాలని పేర్కొంది. నోట్ల రద్దుతో ఇండియా సూపర్ పవర్ కానుందని, తమతో ఉంటే 'సూపర్ పవర్' సొంతమని వ్యాఖ్యానాలు చేసింది. ఇక ఈ యాడ్ ను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ఈ బ్రాండ్ మాత్రల ప్రచారానికి ఎంత తీసుకున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News