: అమరావతి సచివాలయ రహదారిపై తొలి ధర్నా, నిలిచిపోయిన ఉద్యోగులు... రంగంలో ఎస్పీ నారాయణనాయక్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్రటేరియేట్ కు వెళ్లే రహదారిపై తొలి ధర్నాను బ్యాంకు ఖాతాదారులు చేపట్టారు. నాలుగు రోజుల నుంచి తమకు డబ్బు ఇవ్వడం లేదని, తక్షణం తమ ఖాతాలోని డబ్బంతా తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తూ, మందడంలోని రైతులు, బ్యాంకు ఖాతాదారులు సచివాలయానికి దారితీసే రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఈ ఉదయం సచివాలయానికి వెళ్లాల్సిన ఉద్యోగులంతా రోడ్లపై నిలిచిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ నారాయణనాయక్ హుటాహుటిన ఘటనా స్థలికి తరలివచ్చి రైతులతో మాట్లాడారు. రైతులు ససేమిరా అనడంతో బ్యాంకులో పరిస్థితిని వాకబుచేశారు. ఆర్బీఐ చెస్ట్ నుంచి తమకు కరెన్సీ రాలేదని బ్యాంకు అధికారులు వెల్లడించినట్టు తెలుస్తోంది. రైతులకు సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News