: అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్


దేశ రక్షణకు సంబంధించి భారత ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, భారీ ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుని, త్రివిధ దళాలను బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో, అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. రూ. 5 వేల కోట్లతో ఎం777 తరహా అతి తేలికైన హోవిట్జర్ గన్స్ కొనుగోలుకు యూఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 1980లలో బోఫోర్స్ కుంభకోణం బయటపడిన తర్వాత.... ఆర్టిలరీ గన్స్ కొనుగోలుకు జరిగిన మొట్టమొదటి ఒప్పందం ఇది. ఈ గన్స్ కొనుగోలుకు సంబంధించి 'లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్' మీద భారత్ సంతకం చేసింది. ఎం777 తరహా హోవిట్జర్ గన్స్ బరువు చాలా తక్కువగా ఉండటంతో, వీటిని హెలికాప్టర్ల సహాయంతో కూడా తరలించే వీలుంటుంది. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ఎత్తైన ప్రదేశాలకు కూడా వీటిని తరలించవచ్చు. ఒప్పందం ప్రకారం భారత్ కు తొలుత 25 గన్స్ వస్తాయి. మిగిలిన వాటిని మన దేశంలోనే మహీంద్రా సంస్థ భాగస్వామ్యంతో అసెంబుల్ చేస్తారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మొదట రెండు హోవిట్జర్లు భారత్ కు వస్తాయి. ఆ తర్వాత ప్రతి నెలా రెండు చొప్పున వస్తాయి.

  • Loading...

More Telugu News