: బ్యానర్లకు బాంబులు అమర్చిన మావోలు.. తొలగిస్తుండగా పేలుడు.. భూపాలపల్లిలో ఘటన
ఆచార్య జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో మావోయిస్టులు కట్టిన బ్యానర్లలో అమర్చిన బాంబులు పేలడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీలోని విద్యుత్ స్తంభాలకు మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. వాటిని గుర్తించిన పోలీసులు స్థానికుల సాయంతో తొలగిస్తుండగా వాటిలో అమర్చిన బాంబులు పేలాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.