: నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన.. బందర్‌పోర్టు నిర్వాసితులతో భేటీ.. బహిరంగ సభ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. బందరు పోర్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి బాధిత ప్రజలతో మాట్లాడనున్నారు. పోర్టు నిర్మాణం కారణంగా భూ నిర్వాసితులుగా మారిన బందరు మండలంలోని బుద్దాలవారిపాలెం, కోన గ్రామాల్లో పర్యటించి వారికి భరోసా ఇవ్వనున్నారు. భూ నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు.