: రజనీకాంత్ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను: ఎమీ జాక్సన్


‘రోబో’ సీక్వెల్ ‘2.0’ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ నటిస్తోంది. ‘2.0’ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ రజనీకాంత్ ఉద్వేగం చెందడాన్ని గమనించిన ఎమీ జాక్సన్ ‘సార్, మీరు ఫస్ట్ లుక్ విడుదల చేసే విషయంలో ఎగ్జైటింగ్ గా ఉన్నారా?’ అని ఆయన్ని ప్రశ్నించిందట. ఇందుకు రజనీ, ‘నిజమే ఎమీ, నాకు బిడియంగా ఉంది. ఎందుకంటే, మీడియా దృష్టి నాపై ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీలవుతా’ అని సమాధానమిచ్చారట. దీంతో ఆశ్చర్యపోయిన ఎమీ.. ‘మీరు సూపర్ స్టార్ కదా, మీరు కూడా ఇలా ఫీలవుతారా?’ అంటూ మరో ప్రశ్న సంధించగానే.. ‘అవును, నాకు బిడియం ఉంది’ అని తమిళ సూపర్ స్టార్ సమాధానమిచ్చారని ఎమీ జాక్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News