: కడప విమానాశ్రయం రన్ వే పొడిగింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!


కడప జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కడపలోని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో... రన్ వే పొడిగింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్ వేను 1.2 కిలోమీటర్ల మేర పొడిగించుకునేందుకు ఏఏఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికోసం రూ. 80 కోట్లను ఖర్చు చేయనున్నారు. జంబో విమానాలు కూడా రన్ వేపై దిగేలా విస్తరణ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాదు, రాత్రి వేళల్లో కూడా విమానాలు దిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.

  • Loading...

More Telugu News