: తన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకును సాధించిన విరాట్.. 12 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకును సాధించాడు. ఇటీవల జరిగిన మొహాలీ టెస్టు అనంతరం తాజాగా ఐసీసీ టెస్టు బ్యాట్స్ మన్ ర్యాంకులను ప్రకటించింది. అందులో కోహ్లీ 833 రేటింగ్‌తో 3వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 3వ ర్యాంకును తొలిసారి దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో టీమిండియా మొదటి టెస్టు ఆడకముందు వరకు విరాట్ 15వ ర్యాంకులో ఉన్నాడు. మూడో టెస్టు మ్యాచు అనంతరం ఏకంగా 12 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇదే ఆటతీరు కనబరిస్తే సిరీస్ పూర్తయ్యే సరికి కోహ్లీ టెస్టుల్లో ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ర్యాకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 897 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.