: జియో రంగప్రవేశంతో.. బంపర్ ఆఫర్ ప్రకటించిన డిష్ టీవీ
టెలికాం రంగంలో సంచలన ఫలితాలు సాధించిన రిలయన్స్ జియో తాజాగా డీటీహెచ్ రంగంలోకి ప్రవేశిస్తోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజైన డిసెంబర్ 28న దీనిని లాంఛ్ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు డీటీహెచ్ సేవలందిస్తున్న ఇతర సంస్థలు కూడా గడ్డుకాలం ఎదుర్కొంటాయని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే జాగ్రత్తపడ్డ డిష్ టీవీ తన కస్టమర్లు చేజారిపోకుండా ఆఫర్లు ప్రకటించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో డిష్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కలర్స్ మరాఠి హెచ్ డీ, జీ బంగ్లా, జీ మరాఠీ, కలర్స్ కన్నడ హెచ్ డి, కలర్స్ బంగ్లా హెచ్ డి, జీ టాకీస్, జెమినీ, ఈటీవీ, సన్ మ్యూజిక్, కెటీవీ, చానల్స్ ను కేవలం 59 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 28 వరకు వర్తించనుంది. డిసెంబర్ 28న జియో ప్రకటించే ఆఫర్ ను అనుసరించి దీనిని సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.