: షాక్ మీద షాక్.. ఆ ఆటో డ్రైవర్ ఖాతాలో మరో రూ.999 కోట్లు వచ్చిపడ్డాయ్!
ఈ నెల 4వ తేదీన తన బ్యాంకు ఖాతాలో 9,806 కోట్ల రూపాయలు పడడంతో బల్వీందర్ సింగ్ అనే పంజాబ్‌కి చెందిన ఆటో డ్రైవర్ ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ గా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత బల్వీందర్ సింగ్ బ్యాంకు ఖాతాను బ్యాంకు సిబ్బంది సరిచేశారు. అయితే, తాజాగా ఆయన అకౌంట్లోకి మరో రూ.999 కోట్లు వచ్చిపడ్డాయి. ఈ నెల 19న తన బ్యాంకు ఖాతాలో రూ.167 డిపాజిట్ అయినట్లు ఆయన మెసేజ్ అందుకున్నాడు. అనంతరం తన బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకున్నాడు. దీంతో మరోసారి షాక్ కి గురయ్యాడు. ఈ సారి ఆయన ఖాతాలో రూ.999 కోట్లు ఉన్నట్లు తెలుసుకొని బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఈసారి కూడా పొరపాటే జరిగిందని చెప్పారు. సాంకేతిక కారణాలతో పదే పదే ఆయన ఖాతాలో కోట్ల కొద్దీ డబ్బు పడుతుండడంతో తాత్కాలికంగా అతని బ్యాంక్ ఖాతాను మూసివేస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.