: జట్టుతో పాటే వ్యక్తిగత ర్యాంకులు కొడుతున్న కోహ్లీ!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టు ర్యాంకులతో పాటే తన వ్యక్తిగత ర్యాంకును కూడా పదిలంగా కాపాడుకుంటున్నాడు. ఆసక్తిగొలిపే టీమిండియా, కోహ్లీ ర్యాంకుల వివరాల్లోకి వెళ్తే... టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, టీట్వంటీల్లో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు. వన్డేల్లో టీమిండియా 4వ ర్యాంకులో ఉండగా, కోహ్లీ టెస్టుల్లో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీ20ల్లో టీమిండియా వరల్డ్ నెంబర్ 2 ర్యాంకులో నిలవగా, కోహ్లీ వన్డేల్లో వరల్డ్ నెంబర్ 2 ర్యాంకులో నిలిచాడు. దీంతో టీమిండియా కోహ్లీ ర్యాంకులు జంబ్లింగ్ విధానంలో సరిగ్గా సరిపోయాయని పేర్కొంటున్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకు : భారత్ 1.. కోహ్లీ 4 ఐసీసీ వన్డే ర్యాంకు : భారత్ 4.. కోహ్లీ 2 ఐసీసీ టీ20 ర్యాంకు : భారత్ 2.. కోహ్లీ 1