: జేఎన్‌టీయూహెచ్ లో ర్యాగింగ్... జూనియర్ ని క్యాంపస్‌లో అర్ధనగ్నంగా పరిగెత్తించిన వైనం


హైదరాబాద్‌లో ర్యాగింగ్ భూతం మ‌రోసారి పంజా విప్పింది. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్ లో సీనియర్లు జూనియర్ విద్యార్థిపై దారుణంగా ప్రవర్తించారు. రాఘవేంద్ర అనే బీటెక్‌ విద్యార్థిని తీవ్రంగా వేధించారు. గత అర్ధరాత్రి సీనియర్‌ విద్యార్థులు రెచ్చిపోయి రాఘవేంద్రను అర్ధనగ్నంగా క్యాంపస్‌లో పరుగులు పెట్టేలా చేశారు. దీంతో ఈ రోజు విష‌యాన్ని తెలుసుకున్న‌ జూనియ‌ర్ విద్యార్థులు సీనియర్ల ప్ర‌వ‌ర్త‌న తీరుకు నిరసనగా క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. దీంతో క్యాంప‌స్ లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సీనియ‌ర్ల ఆగ‌డాల‌ను అదుపు చేయాల‌ని విద్యార్థులు నిన‌దిస్తున్నారు.

  • Loading...

More Telugu News