: సుక్నాలో కూలిన భారత ఆర్మీ హెలికాఫ్టర్... ముగ్గురి మృతి
పశ్చిమ బెంగాల్‌లోని సుక్నా ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం భారత ఆర్మీ హెలికాఫ్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో జూనియర్ ఆఫీసర్‌కి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలయిన అధికారిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్మీ హెలికాఫ్టర్ ఏ కారణంగా కూలిపోయిందో ఇంతవరకు తెలియలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.