: నిబంధన 56 కింద చర్చ చేపట్టాలి, ఓటింగ్ నిర్వహించాలి: రద్దైన నోట్లపై లోక్‌సభలో మల్లికార్జున ఖర్గే
వాయిదా అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో పెద్దనోట్ల రద్దుపై చర్చ చేపట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. నిబంధన 56 కింద చర్చ చేపట్టిన అనంతరం దానిపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చర్చ పేరు చెప్పగానే పారిపోతున్నారంటూ పాలకపక్షం ఆరోపణలు గుప్పిస్తోందని, తమకు చర్చ జరగాలనే ఉందని ఆయన స్పష్టం చేశారు. తాము స్పీకర్ మీద కూడా విమర్శలు చేయలేదని వ్యాఖ్యానించారు. చర్చ జరిగిన తరువాత కచ్చితంగా ఓటింగ్ కూడా జరగాలని టీఎంసీ ఎంపీలు కోరారు. సభలో హంగామా చేయడం తమ ఉద్దేశం కాదని సీపీఎం నేతలు అన్నారు.