: కుమారులకు షాకిచ్చే తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. తల్లిదండ్రుల దయా దాక్షిణ్యాలతో ఇంట్లో ఉండాలని స్పష్టీకరణ
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు కష్టార్జితంతో సంపాదించుకున్న ఇంట్లో చట్టబద్ధ హక్కు కుమారుడికి ఉండదంటూ షాకిచ్చింది. కొడుక్కి వివాహం జరిగినా, జరగకపోయినా తల్లిదండ్రుల దయాదాక్షిణ్యాలతో మాత్రమే వారు ఆ ఇంట్లో ఉండగలరని కుండబద్దలు కొట్టింది. కుమారుడిని ఇంట్లో ఉండానికి అనుమతించినంత మాత్రాన జీవితాంతం అతడిని మోయాలని లేదని పేర్కొంటూ మంగళవారం తీర్పు చెప్పింది. తమ ఇద్దరు కొడుకులు ఉంటున్న రెండు అంతస్తుల నుంచి వారిని ఖాళీ చేయించాలని కోరుతూ ఓ వృద్ధ జంట వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు తీర్పు వెల్లడించింది. ఇల్లు పూర్తిగా తల్లిదండ్రుల స్వీయ ఆర్జితమైనప్పుడు కుమారుడికి వివాహమైనా, కాకపోయినా ఆ ఇంట్లో నివసించే చట్టబద్ద హక్కు వారికి ఉండదని జస్టిస్ ప్రతిభా రాణి ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే వారికి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.