: జీతాలు, పెన్షన్లు నగదుగా ఇవ్వడం సాధ్యపడదు: ఏపీ ఆర్థికశాఖ
ఏపీలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లను నగదుగా ఇవ్వడం సాధ్యపడదని ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. జీతాలు, పెన్షన్లు వారి వారి ఖాతాల్లోనే జమ చేస్తామని, సామాజిక భద్రతా పెన్షన్లు కూడా ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేసింది. ఖాతాలు లేని వారు రెండు రోజుల్లోగా ఆయా బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని పేర్కొంది. అకౌంట్లు తెరిచేందుకు బ్యాంకు అధికారులు సహకరిస్తారని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వికలాంగులకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు.