: ధోనీ, కోహ్లీ మధ్య డ్రా...ఆసక్తికర గణాంకాలు!
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. టెస్టుల్లో తిరుగులేని విజయాలతో కోహ్లీ దూసుకుపోతున్నాడు. కుంబ్లే నుంచి కెప్టెన్సీ తీసుకున్న ధోనీ కూడా ఆరంభంలో ఇలాగే విజయాలతో దూసుకుపోయాడు. దీంతో అనిల్ కుంబ్లే నుంచి 2008లో కెప్టెన్సీ తీసుకున్న ధోనీ తరువాత ఆడిన 20 టెస్టుల్లో 12 విజయాలు, రెండు పరాజయాలు, 6 డ్రాలు సాధించాడు. ఇవే గణాంకాలను ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ కూడా సాధించడం విశేషం. వీరిద్దరూ తమ తొలి 20 టెస్టుల్లో 12 విజయాలు, 2 పరాజయాలు, 6 డ్రాలతో డ్రాగా నిలిచారు. దీంతో క్రీడా విశ్లేషకులు వీరిద్దరి మధ్య స్కోరు టై అయిందని పేర్కొంటున్నారు.