: హైదరాబాద్ ఎంజీబీఎస్ సమీపంలో పట్టుబడ్డ డ్రగ్ ముఠా


హైదరాబాద్ లో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) సమీపంలో డ్రగ్ విక్రయానికి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, మీర్ చౌక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి కిలో డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఈ డ్రగ్ ను ఎపిడ్రిన్ గా ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారన్నారు. పట్టుబడ్డ ముఠా సభ్యులు కేశవ-తిరుపతి, ప్రవీణ్ రెడ్డి-హైదరాబాద్, పవన్, సురేష్ రెడ్డి, హేమంత్ కుమార్ గౌడ్ లను విశాఖపట్టణం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News