: ‘దంగల్’ కోసం అమీర్ బరువు పెరిగాడు..తగ్గాడు - ఇదిగో వీడియో!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘దంగల్’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటించాడు. ఈ చిత్రం కోసం అమీర్ 25 కిలోలు బరువు పెరిగాడు. అయితే, ఈ సినిమాలో మల్లయుద్ధ సన్నివేశం చిత్రీకరణ నిమిత్తం అమీర్ ఫిట్ గా కనిపించాలి. అందుకుగాను, మళ్లీ 25 కిలోల బరువును కొన్ని రోజుల వ్యవధిలోనే తగ్గాడు. ఈ సినిమాలో వివాహమై, పిల్లలు పుట్టిన అనంతరం అమీర్ మళ్లీ బరువు పెరుగుతాడు. ఈ సినిమా కోసం ఫిట్ టు ఫ్యాట్ గా తయారయ్యేందుకు అమీర్ ఖాన్ ఏవిధంగా జిమ్ లో శ్రమించాడో చెబుతూ ‘దంగల్’ చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.