: బాగా ఫ్రష్ట్రేషన్ లో ఉన్నాను: కుక్


వరుసగా రెండు టెస్టులు ఓడిపోవడం ఫ్రష్ట్రేషన్ (నిరాశ)కి గురి చేస్తోందని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ తెలిపాడు. మొహాలీలో మ్యాచ్ ఓటమి అనంతరం కుక్ మాట్లాడుతూ, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నామని చెప్పాడు. గతంలో కూడా కఠినమైన పిచ్ లపై ఆడామని తెలిపాడు. ఇప్పుడు మాత్రం సరిగ్గా ఆడలేకపోతున్నామని తెలిపాడు. టాస్ గెలవడం కొంత సానుకూలంగా కనిపించినప్పటికీ దానిని అనుకూలంగా మలచుకోలేకపోయామని కుక్ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులను నిరాశకు గురి చేశామని తెలిపాడు. మిగిలిన రెండు టెస్టుల్లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. లోపాలు సరిదిద్దుకుంటామని కుక్ చెప్పాడు.

  • Loading...

More Telugu News