: పిచ్ సహకరించలేదు...అందుకే ఫ్లైట్ చేశాను: అశ్విన్


పిచ్ సహకరించలేదని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. మూడో టెస్టులో విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ, పిచ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదని అన్నాడు. బంతి అస్సలు టర్న్ కాలేదని చెప్పాడు. దీంతో ఫ్లాట్ పిచ్ పై బంతిని ఫ్లైట్ చేశానని, దీంతో వికెట్లు తీయగలిగానని అన్నాడు. అంతే కాకుండా కడుపునొప్పితో బాధపడుతూ మ్యాచ్ ఆడానని తెలిపాడు. అది కూడా తనను ఇబ్బంది పెట్టిందని అన్నాడు. అయితే కడుపునొప్పి ప్రభావం తన ఆటపై పడనీయలేదని చెప్పాడు. మూడో టెస్టులో విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు దీటుగా ఆడారని జడేజా చెప్పాడు.

  • Loading...

More Telugu News