: శాంసంగ్ సంస్థ ఇక రెండుగా విడిపోనుంది!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ రెండుగా విడిపోనుంది. ఈమేరకు సంస్థ ఓ ప్రకటన చేసింది. త్వరలోనే తన తండ్రి నుంచి ప్రస్తుత వైస్ చైర్మన్ లీ జే యాంగ్ బాధ్యతలను స్వీకరించడానికి అనుకూలంగానే సంస్థను ఇలా రెండుగా విభజిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆ సంస్థకు అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ ఎలియట్ మేనేజ్‌మెంట్ పెట్టుబడులతో సహా పలు విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పోటీని తట్టుకొని నిలబడడానికి ఒక హోల్డింగ్ కంపెనీ పెట్టి షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు పెంచాలని శాంసంగ్‌పై ఓ డిమాండ్ వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ బ్యాటరీలు పేలుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సదరు మోడల్ ను రీకాల్ చేయాల్సి వచ్చింది. దీంతో సంస్థకు భారీగా నష్టాలు వచ్చే స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాంసంగ్‌ని హోల్డింగ్ కంపెనీ, ఉత్పాదక మరియు ఆపరేటింగ్ కంపెనీలుగా విడగొట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం తాము ఆరు నెలల పాటు అన్ని అంశాలపై చర్చించనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఒక్కోషేరుకు డివిడెండును 36 శాతం పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.