: ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టిన విపక్ష నేతలు.. ప్రారంభమైన మూడు నిమిషాలకే రాజ్యసభ వాయిదా
రాజ్యసభలో విపక్షాలు తమ పట్టును వదలడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయి పెద్దనోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న అవస్థల గురించి తాము చెబుతున్న వివరాలను వినాల్సిందేనని.. వాయిదా అనంతరం 12 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. పెద్దనోట్ల రద్దుపై తాము చర్చకు సిద్ధమేనని, చర్చను మొదలుపెడితే ప్రధాని వచ్చి సమాధానం చెబుతారని ప్రభుత్వ నేతలు ప్రకటించారు. విపక్షనేతలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో సభ ప్రారంభమైన మూడు నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు. రాజ్యసభ తిరిగి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు.